ఫోర్బ్స్ షోస్టాపర్స్‌లో టాలీవుడ్ జోరు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌కు చోటు..
టాలీవుడ్ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన షోస్టాపర్స్ 2026 జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకైక తెలుగు సినీ తారలు వీరిద్దరే కావడం విశేషం. కవర్ పేజీపై అల్లు అర్జున్.. ‘పుష్ప 2: ది రూల్’తో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న అల్లు అర్జున్‌కు ఈసారి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై ఆయన మెరిశారు. పుష్పతో మొదలైన ఆయన పాన్ ఇండియా...