అమెరికాలో మోహన్ భగవత్ ఈవెంట్ ఆర్గనైజర్లకు షాక్..

అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ పర్యటనను న్యూయార్క్ మేయర్ మామ్దాని వ్యతిరేకించగా, అనేక ఇస్లామిక్ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా మోహన్ భగవత్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సంస్థకు సోషల్ మీడియా సంస్థ ఎక్స్‌ షాకిచ్చింది. ఈ సంస్థ ఎక్స్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది.అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్‌ అండ్ డైలాగ్ (ఏహెచ్‌ఈఏడీ) సంస్థ న్యూయార్క్‌ నగరంలోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో మోహన్ భగవత్‌తో ‘యూనివర్సల్ వన్‌నెస్‌’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 29న ఈ సదస్సు జరగాల్సి ఉంది. దీనికి దాదాపు 5,000 మంది హాజరవుతారు. అయితే, మోహన్...