జీవీ నారాయణరావుకి నివాళులు అర్పించిన‌ చిరంజీవి..

తెలుగు సినీ, రంగస్థల నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీవీ నారాయణరావుతో తనకు 1977 నుంచే పరిచయం ఉందని చిరంజీవి తెలిపారు. తాను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లో నారాయణరావు సీనియర్ విద్యార్థిగా తరగతులకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ మధ్య స్నేహం మరింత బలపడిందని చెప్పారు.సౌత్ ఏషియన్ కల్చరల్ ఈవెంట్లను కనుగొనడం“నారాయణరావు లేరు అనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనతో నాకు చాలా...