‘ఇరుముడి’కి వివాదాల సెగ..

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో సినిమా జోరు కొనసాగుతుండటం విశేషం. అయితే ఒకవైపు భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’.. మరోవైపు కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థను ప్రతికూలంగా చిత్రీకరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.‘ఇరుముడి’ సినిమాలో...