జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..
కడుపులో ఇన్ఫెక్షన్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వాలని చాలామంది భావిస్తారు. అందుకే అరటిపండు, అన్నం, యాపిల్‌సాస్, టోస్ట్‌తో కూడిన బ్రాట్ డైట్ ను చాలాకాలంగా పాటిస్తున్నారు. అయితే కేవలం ఈ నాలుగు ఆహారాలకే పరిమితం కావడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాంతులు, తీవ్రమైన విరేచనాలు తగ్గుముఖం పట్టిన తర్వాత క్రమంగా వైవిధ్యమైన, ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం జీర్ణవ్యవస్థ కోలుకోవడానికి సహాయపడుతుంది. కలుషితమైన ఆహారం లేదా నీటి కారణంగా వచ్చే కడుపు ఇన్ఫెక్షన్ జీర్ణవ్యవస్థ సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీంతో విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి....