బిలియన్ డాలర్ల బ్లాక్‌బస్టర్ ‘మైఖేల్’ ఇక ఓటీటీలో..

ఈ ఏడాది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘మైఖేల్’ ఒకటి. ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బయోపిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన మామయ్య మైఖేల్ జాక్సన్ పాత్రలో జాఫర్ చూపించిన హావభావాలు, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజా నివేదికల ప్రకారం ఈ...