200 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మాస్ మహారాజా సినిమా!

మాస్ మహారాజా రవితేజకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తూ మరో భారీ మైలురాయిని అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు తాజా టికెట్ సేల్స్‌నే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా 70 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.కొత్త సినిమాలను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేయడంఒక...