సీడ్ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి
వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని కోరారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తుందని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి...