రోజూ ఒక టీస్పూన్ పొడి వాడితే చాలు - షుగర్ కంట్రోల్, గుండె సేఫ్..!!
మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మునగాకు పొడి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రకృతిసిద్ధమైన ఔషధం. మునగ ఆకు పొడిని వాడడం వల్ల చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. దీంతో యవ్వనంగా కనిపి స్తారు. మునగాకుల పొడిలో కాస్త రోజ్ వాటర్ కలిపి నల్లని మచ్చలు, మొటిమలు ఉన్న చోట రాసి ఆ తరువాత తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ఆయా సమస్యలు తగ్గుతాయి. మునగాకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. అందువల్ల ఈ పొడిని రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగు తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మునగాకుల్లో మెగ్నిషియం,...