‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజ రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, యాక్షన్ అంశాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ విషయానికి వస్తే.. ఓ సంక్షోభంలో చిక్కుకున్న గ్రామస్తులు తమ గ్రామ దేవత మరెమ్మ తల్లిపై నమ్మకం పెట్టుకుంటారు. అయితే అమ్మవారికి సంబంధించిన పవిత్రమైన ఎద్దు అనూహ్యంగా కనిపించకుండా పోవడంతో గ్రామంలో ఒక్కసారిగా...