‘ఇరుముడి’కి పారితోషికం వద్దని.. థియేట్రికల్ రైట్స్‌తో భారీ జాక్‌పాట్ కొట్టిన రవితేజ!
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.180 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతూ రవితేజ కెరీర్‌లో మొట్టమొదటి రూ.200 కోట్ల సినిమాగా రికార్డు నమోదు చేయబోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి రవితేజ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ, ‘ఇరుముడి’ సినిమాకు మాత్రం ఎలాంటి...