మీ పిల్ల‌లు త‌ర‌చూ ఒకే ర‌క‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారా..

చిన్నారులు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. ఒకసారి అనారోగ్యం నుంచి కోలుకుని పాఠశాలకు వెళ్లిన కొద్ది రోజులకే మళ్లీ అదే సమస్యలు రావడంతో పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందేమోనని చాలామంది భావిస్తారు. అయితే పిల్లల ఎదుగుదలలో భాగంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచూ రావడం సాధారణమే. కొత్త కొత్త క్రిములను ఎదుర్కొంటూ వారి రోగనిరోధక వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఒకటి నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ఏడాదిలో 6 నుంచి 8 సార్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణంగా కనిపిస్తుంది. ప్లేస్కూల్‌కు వెళ్లే పిల్లల్లో ఈ సంఖ్య ఏడాదికి...