డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ..

తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నేతృత్వంలోని వర్గానికి, సంఘం నాయకురాలు సుమలత ప్యానెల్‌కు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది.రఘు మాస్టర్ నేతృత్వంలోని కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదని సుమలత తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అసోసియేషన్ బైలాస్...