ప్రపంచ పటంలో మార్పులు: ఆఫ్రికా పెద్దగా.. అమెరికా చిన్నగా..

ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్ ప్రపంచ పటానికి బదులుగా.. భూమి ఉపరితలాన్ని మరింత కచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ఈ నూతన ప్రపంచ పటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కనిపిస్తుండగా.. ఐరోపా, ఉత్తర అమెరికా సైజు చిన్నగా అయింది. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీర్మానానికి 164 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా మాత్రమే దీనికి వ్యతిరేకించగా.. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కాగా ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని సభ్య దేశాలను ఐరాస కోరింది.మారిటైం నేవిగేషన్...