రివ్యూలను దాటుకుని దూసుకెళ్తున్న ‘రంభ ఊర్వశి మేనక’..
సినిమాలో సరైన కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు దానికి ఎలాంటి ఆదరణ అందిస్తారో ‘రంభ ఊర్వశి మేనక’ మరోసారి నిరూపిస్తోంది. హాస్య కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సోషియో-ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. తొలి రోజు సినిమాకు మిశ్రమ స్పందనతో పాటు కొన్ని నెగెటివ్ రివ్యూస్ ఎదురయ్యాయి. కథలో కొత్తదనం లేదని, పాత ఫార్ములా ఛాయలు కనిపిస్తున్నాయని కొన్ని రివ్యూస్ వచ్యాయి. అయితే ఈ రివ్యూల ప్రభావం బాక్సాఫీస్‌పై పెద్దగా కనిపించడం లేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్‌తో సినిమాకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నట్లు...