ఏడుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ పిలుపు..!
జపాన్ లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటోఅనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. దేశం కోసం పిల్లలను కనాలని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. తాను ఏడో బిడ్డకు జన్మనిచ్చానని, జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన తన బిడ్డకు అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరింది.‘నేను 7వ బిడ్డకు జన్మనిచ్చాను. జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన నా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి ఇప్పటికే అండగా నిలబడిన మీ అందరికీ ధన్యవాదాలు. మన దేశం కీలక దశకు చేరుకుంది. జపాన్...