డొనాల్డ్ ట్రంప్ మరో పోస్టు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. యూఎస్ఏలోని న్యూమెక్సికో రాష్ట్రం పేరును న్యూ అమెరికాగా మార్చాలన్న ప్రతిపాదనకు అద్దం పట్టే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ రాష్ట్రం పేరులోని మెక్సికో పదాన్ని కొట్టేసి అమెరికా పేరు రాసున్న మ్యాపును నెట్టింట పంచుకున్నారు. దీంతో, ఈ అంశం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.ఇటీవల కాలంలో ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. కెనడా సరిహద్దు వద్ద ఉన్న మరో సరస్సుకు కూడా లేక్ అమెరికా అని పేరు మార్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు, హోర్ముజ్ జలసంధిని ట్రంప్ స్ట్రెయిట్‌గా పిలిస్తే బాగుందని అన్నారు....