శరరీంలో రెండో ప్రసరణ వ్యవస్థ ఇది..
మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ అనగానే గుర్తుకు వచ్చేది గుండె, ధమనులు, సిరలు. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉండాలో అందరికీ తెలిసిందే. అయితే వీటితోపాటు శరీరంలో నిశ్శబ్దంగా పనిచేసే మరో ముఖ్యమైన రవాణా వ్యవస్థ కూడా ఉంది. అదే లింఫాటిక్ వ్యవస్థ. శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడటం, కొన్ని రకాల కొవ్వులను తరలించడం, రోగనిరోధక వ్యవస్థకు సహకరించడం వంటి కీలక విధులను ఇది నిర్వహిస్తుంది. అందుకే దీనిని శరీరంలోని రెండో ప్రసరణ వ్యవస్థగా కూడా పిలుస్తారు. రక్త ప్రసరణ వ్యవస్థకు గుండె ప్రధాన పంప్‌గా పనిచేస్తుంది. కానీ లింఫాటిక్ వ్యవస్థకు అలా నిరంతరం ద్రవాన్ని పంపించే ప్రత్యేకమైన కేంద్ర అవయవం ఉండదు. కండరాల కదలికలు,...