సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో బృందం నుంచి ‘సీడ్ గణేశ్’ప్రతిమను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ పరిరక్షణపై కీలక పిలుపునిచ్చారు.మన నగరాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన మట్టి విగ్రహాలను, సీడ్ (విత్తన) విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పండుగ ముగిసిన తర్వాత ఆ విగ్రహం ద్వారా ఒక మొక్క ఎదుగుతుందని, భక్తితో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమానికి విజయ్ దేవరకొండ...