‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో బలైన కూలీలు’
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేదలే తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం మాణిక్యరంలో శుక్రవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకిచ్చిన అనేక హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీల అమలుకు...