‘రోబో’ రీరిలీజ్‌పై పెరుగుతున్న డిమాండ్..

భారతీయ సినిమా చరిత్రలో సాంకేతికంగా, విజువల్‌గా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’కు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రజినీకాంత్ స్టార్‌డమ్, శంకర్ విజన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత.. ఇవన్నీ కలసి ‘రోబో’ను ఒక ఎపిక్ మూవీగా నిలబెట్టాయి. విడుదలై ఇన్నేళ్లు గడిచినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘రోబో’ను మరోసారి థియేటర్లలో చూడాలని అభిమానులు...