‘మండాడి’ ఘనవిజయంపై కృతజ్ఞతలు తెలిపిన సూరి, సుహాస్!

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు మదిమారన్ పుగళేంది అద్భుతమైన కంటెంట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విలక్షణమైన చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, రోజురోజుకూ కలెక్షన్ల పరంగా అద్భుతమైన జోరును ప్రదర్శిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణను పురస్కరించుకుని చిత్ర బృందం శనివారం నాడు హైదరాబాద్‌లో ‘యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్’ వేడుకను ఎంతో వైభవంగా...