హార్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద‌ ఇరాన్ నౌక‌పై దాడి..

అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. రెండు దేశాలు ప‌ర‌స్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హార్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఇరాన్ వాణిజ్య నౌక‌పై దాడి జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జ‌ల‌సంధి ప‌రిధిలోని క్వెష్మ్ ఐలాండ్ స‌మీపంలో ఆదివారం జ‌రిగింది. క్వెష్మ్, హెంగామ్ ఐలాండ్ తీరంలో ఉద‌యం ఐదు గంట‌ల స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింద‌ని ఇరాన్ మీడియా వెల్ల‌డించింది. బ్రిట‌న్‌కు చెందిన యునైటెడ్ కింగ్‌డ‌మ్ మారిటైమ్ ట్రేడ్ ఆప‌రేష‌న్స్ కూడా ఈ విష‌యాన్ని నిర్ధ‌రించింది. ఇరాన్ వాణిజ్య నౌక‌పై ఒక వ‌స్తువుతో దాడి జరిగింద‌ని ఈ సంస్థ తెలిపింది. అయితే, పూర్తి వివ‌రాల్ని...