క్యాన్సర్‌ను పసిగడుతున్న శునకాలు..
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఖరీదైన పరీక్షలు, వైద్య సదుపాయాల కొరత కారణంగా అనేక మంది రోగుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో కుక్కల అద్భుతమైన వాసన గుర్తించే సామర్థ్యాన్ని కృత్రిమ మేధతో అనుసంధానించి క్యాన్సర్‌ను గుర్తించే చవకైన, శరీరంలో ఎలాంటి జోక్యం లేని పరీక్షను అభివృద్ధి చేసేందుకు బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ప్రయత్నిస్తోంది. బెంగళూరు శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో క్లోయీ అనే కుక్కకు మనుషుల శ్వాసలో క్యాన్సర్‌కు సంబంధించిన వాసనలను గుర్తించే శిక్షణ ఇస్తున్నారు. కుక్క శరీరానికి ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ ముద్రిత హెల్మెట్, సెన్సార్లతో...