బాక్సాఫీస్‌ వద్ద ‘మండాడి’ మేనియా.. 5 రోజుల్లో రూ.65 కోట్లు..

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘మండాడి’ (Mandadi) బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బోట్ రేసింగ్ నేపథ్యంతో సాగే వినూత్న కథాంశం, అద్భుతమైన యాక్షన్‌ ఘట్టాలు ప్రేక్షకులను థ్రియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి.అయితే ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు, దీని డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన...