అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన వైవిధ్యమైన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. (ఉపశీర్షిక: ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా…). ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ వంటి విలక్షణ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై తెరకెక్కిన ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్...