70 పేట్రియాట్ ఇంట‌ర్‌సెప్టార్లతో.. 20 ఇరానీ క్షిప‌ణుల కూల్చివేత‌

ఇరాన్‌తో జ‌రుగుతున్న వార్‌లో అమెరికా త‌న ఆయుధ సంప‌ద‌ను భారీగా పోగొట్టుకుంటున్న‌ది. మిస్సైల్ ఇంట‌ర్‌సెప్టార్ల‌ను విరివిగా వాడేస్తున్న‌ది. ప‌శ్చిమాసియాలో ఇరాన్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు అమెరికా త‌న క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను వినియోగిస్తున్న‌ది. అయితే విభిన్న వ్యూహాల‌తో ఇరాన్ దాడులు చేస్తున్న నేప‌థ్యంలో.. అమెరికా త‌న ఆయుధాల‌ను అధికంగా వాడాల్సి వ‌స్తున్న‌ది. గ‌త వారం జోర్డాన్‌లోని అమెరికా వైమానిక ద‌ళంపై ఇరాన్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. బాలిస్టిక్ క్షిప‌ణుల‌తో ఇరాన్ విరుచుకుప‌డింది. ఆ దాడిని తిప్పికొట్టేందుకు అమెరికా సుమారు 70 హై ఎండ్ ఎయిర్ డిఫెన్స్ ఇంట‌ర్‌సెప్టార్ల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం 20 ఇరానీ బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను కూల్చేందుకు సుమారు 60 నుంచి 70 వ‌ర‌కు...