మందులను సక్రమంగా తీసుకుంటున్నా షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయా..
మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. అయినప్పటికీ కొందరిలో అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరగడం కనిపిస్తుంది. మందులు సక్రమంగా తీసుకుంటున్నా ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, భోజనం చేసే సమయం, తీసుకునే ఆహారం పరిమాణం, శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు రక్తంలో చక్కెరపై ప్రభావం చూపుతాయి. జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరుగుతాయి. అందుకే మందులతోపాటు జీవనశైలిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలు.. శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం...