సౌదీ ఎఫ్-15 యుద్ధ విమానం కూల్చివేత..
సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని(F-15 Jet) .. యెమెన్‌లోని హౌతీలు కూల్చివేశారు. స్థానికంగా తయారు చేసిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌తో ఆ ఫైటర్ జెట్‌ను షూట్ చేసినట్లు చెప్పారు. శత్రు ఆపరేషన్స్ చేపడుతున్న సమయంలో దాన్ని కూల్చినట్లు పేర్కొన్నారు. మారిబ్ ప్రావిన్సులో ఆ విమానం కూలినట్లు హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యె సారే తెలిపారు. సౌదీ ఎఫ్-15 జెట్ కూల్చివేతకు చెందిన వీడియోను హౌతీలు రిలీజ్ చేశారు. రాత్రి వేళ ఆ యుద్ధ విమానాన్ని నేలకూల్చారు. ఇక దాని శిథిలాలను మారిబ్ ప్రావిన్సులో గుర్తించారు. సుమారు నాలుగు నిమిషాలు ఉన్న ఓ వీడియోను హౌతీలు రిలీజ్ చేశారు. జెట్‌ను టార్గెట్ చేసిన...