రోడ్డు ప్రమాదం తర్వాత పండు మాస్టర్ కీలక నిర్ణయం..

బుల్లితెరపై తనదైన డ్యాన్స్, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం పండు కదల్లేని పరిస్థితిలో బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ మునుపటిలా డ్యాన్స్ చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన స్టేజ్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బుల్లితెర కళాకారులకు వరుసగా కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఉంటేనే ఆదాయం...