సన్నగా ఉండే వారికే ప్రోటీన్ లోపం ఉంటుందా..
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు రోజూ ఎక్కువ ఆహారం, కేలరీలు తీసుకుంటున్నప్పటికీ వారి శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ అందదు. సాధారణంగా ప్రోటీన్ లోపం అంటే సన్నగా ఉండేవారికే వస్తుందని భావిస్తారు. అయితే ఇది సరైన అవగాహన కాదు. కేలరీలు, ప్రోటీన్ రెండూ వేర్వేరు పోషకాలు. శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెర, వేయించిన పదార్థాలు, ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు. అదే సమయంలో ప్రోటీన్ తీసుకోవడం మాత్రం తక్కువగా ఉంటుంది. అందువల్ల శరీర బరువును మాత్రమే చూసి పోషకాహార స్థితిని అంచనా వేయడం సరిపోదు. నిండుగా భోజనం చేస్తే.. భారత్‌లో అనేక కుటుంబాల ఆహారంలో అన్నం, చపాతీలు, ఇతర ధాన్య...