రెండో వారంలోనే కృష్ణుడి ఎలిమినేషన్..
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో నటుడు కృష్ణుడు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో చైత్ర రాయ్ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. రెండో వారం నామినేషన్స్‌లో సుధీర్, సృష్టి, కృష్ణుడు చివరి వరకు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. వీరిలో కృష్ణుడికి తక్కువ ఓట్లు రావడంతో నాగార్జున ఆయన ఎలిమినేషన్‌ను ప్రకటించారు. దీంతో దాదాపు రెండు వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కృష్ణుడి ప్రయాణం ముగిసింది.హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు పెద్దగా చురుగ్గా కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి....