నారా రోహిత్‌ కుమారుడి పేరు ఇదే..

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ కుమారుడి ఫొటో, పేరు గురించి పెద్దగా వెల్లడించని ఈ దంపతులు తాజాగా తమ బిడ్డను అభిమానులకు పరిచయం చేశారు. అంతేకాదు.. తమ కుమారుడికి పెట్టిన పేరును కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నారా రోహిత్‌, సిరిలెల్లా కలిసి తమ కుమారుడితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సిరి తన బాబును ఎత్తుకుని ఉండగా.. రోహిత్‌ పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. తమ కుమారుడిని ఈ...