మ‌గ శిశువులు జన్మిస్తే తల్లుల‌కు ఎందుకు క‌ష్టం ఎక్కువగా ఉంటుంది..

ప్రసవం సమయంలో తల్లులు ఎదుర్కొనే నొప్పి, ఇబ్బందులకు ఇప్పటివరకు మానవ పరిణామ క్రమంలో జరిగిన శారీరక మార్పులనే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం.. పుట్టబోయే శిశువు లింగం కూడా ప్రసవం క్లిష్టతపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మగ శిశువులు ఆడ శిశువులతో పోలిస్తే పుట్టుక సమయంలో ఎక్కువ బరువుతో ఉండే అవకాశం ఉండడంతో, ప్రసవ సమయంలో తల్లికి అదనపు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని కాస్ట్లీ సన్ హైపోథిసిస్ గా పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, ప్రసవం ఎందుకు క్లిష్టంగా ఉంటుందనే అంశంపై కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది....