చెల్లాచెదురుగా దుస్తులు.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి..!

జూలూరుపాడు, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి ఒంటిపై గాయాలు ఉండటం, దుస్తులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఇది ముమ్మాటికీ దారుణ హత్యేనని బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం తండ్రి సతీష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. వీరి పెద్ద కుమార్తె ఇంద్రవెల్లి హరిణి (18) ఖమ్మం జిల్లా తనికెళ్ల...