సూరి ‘మండాడి’ సెన్సేషన్.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్టు నిర్మాతల అధికారిక ప్రకటన

తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్ల మార్కును దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్మంట్ సంస్థ తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ‘మండాడి’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మండాడి’కి తొలి రోజు నుంచే మంచి స్పందన లభించింది. కథ, నటీనటుల ప‌ర్‌ఫార్మెన్స్, తీరప్రాంత జీవనశైలి, సముద్ర నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని...