రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి..
రష్యాతో వాణిజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్, చైనా, తుర్కియే దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా పిలుపునిచ్చారు. ఇంధన వాణిజ్యానికి ముగింపు పలకాలని అన్నారు. రష్యా తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు ఈ దేశాలపైనే అధికంగా ఆధారపడుతోందని అంతర్జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, చైనా, అమెరికాల ఒత్తిడి పెరిగితే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని కొనసాగించలేదని అన్నారు.‘రష్యా అష్టదిగ్బంధనంలో ఉంది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ భారత్, చైనా, తుర్కియేపై ఆధారపడి ఉంది. వీళ్లు ఈ ఇంధన వాణిజ్యాన్ని కట్టిపెడితే, అమెరికా ఒత్తిడి పెంచితే.. రష్యా క్షణాల్లో యుద్ధాన్ని కట్టిపెడుతుంది. చైనా, భారత్‌లు కలిసి ఒత్తిడి పెంచితే చాలు’ అని అన్నారు. యుద్ధం...