‘ది ప్యారడైజ్’కు భారీ ఓపెనింగ్.. విడుదలకు ముందే 15 లక్షల టికెట్లు అమ్మకం!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ మంచి స్పందన అందుకోవడంతో.. ఈ సినిమాపై కూడా మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్’కు వచ్చిన స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముందస్తు టికెట్ బుకింగ్స్‌లో ఈ సినిమా భారీ సంఖ్యను నమోదు చేసింది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వేదికల ద్వారా కలిపి ఇప్పటికే 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్రబృందం...