జడల్ గెటప్‌లో నాని సినిమాకు యంగ్ హీరో..
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’, నాని పోషించిన జడల్ పాత్ర గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హర్ష్ రోషన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను చూసేందుకు హర్ష్ రోషన్ హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌కు వెళ్లాడు. అయితే సాధారణంగా వెళ్లకుండా.. సినిమాలో నాని కనిపించిన జడల్ గెటప్‌ను పోలిన లుక్‌లో థియేటర్‌కు...