గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ర‌న్నింగ్ వ‌ర్సెస్ బాడీవెయిట్‌ స్క్వాట్స్‌..

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏ వ్యాయామం ఎక్కువగా ఉపయోగపడుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా బాడీవెయిట్‌ స్క్వాట్స్‌, రన్నింగ్‌ రెండూ శరీరానికి మేలు చేసినప్పటికీ, వాటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. రన్నింగ్‌ ప్రధానంగా ఏరోబిక్‌ వ్యాయామం కాగా, స్క్వాట్స్‌ కండరాల బలాన్ని పెంచే వ్యాయామంగా పనిచేస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యం కోసం ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది వ్యక్తి వయసు, శారీరక సామర్థ్యం, ఆరోగ్య పరిస్థితి, వ్యాయామాన్ని తట్టుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ర‌న్నింగ్ చేస్తే.. రన్నింగ్‌ చేసే సమయంలో గుండె వేగం కొంతసేపు పెరిగి ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు పనిచేసే కండరాలకు నిరంతరం ఆక్సిజన్‌ అందించాల్సి రావడంతో...