హైరోక్స్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎలా చేయాలి..

ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైరోక్స్‌ వంటి అధిక తీవ్రత కలిగిన వ్యాయామ విధానాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది సాధారణ జిమ్‌ వ్యాయామాలు లేదా కేవలం రన్నింగ్‌కు భిన్నంగా ఉంటుంది. ఇందులో పరుగు, కండరాల బలం, శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే వ్యాయామాలను కలిపి చేస్తారు. సాధారణంగా ఎనిమిది కిలోమీటర్ల పరుగు మధ్యలో ఎనిమిది రకాల వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. స్కీఎర్గ్‌, స్లెడ్‌ పుష్‌, స్లెడ్‌ పుల్‌, బర్పీ బ్రాడ్‌ జంప్స్‌, రోయింగ్‌, ఫార్మర్స్‌ క్యారీ, సాండ్‌బ్యాగ్‌ లంజెస్‌, వాల్‌ బాల్స్‌ ఇందులో ఉంటాయి. ప్రతి దశలో శరీరంపై భిన్నమైన ఒత్తిడి పడడంతో గుండె సామర్థ్యంతో పాటు కండరాల బలం, సహనశక్తి కూడా పరీక్షకు గురవుతాయి....