ఆర్చరీ మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్‌లో 11వ రోజు భారత్‌కు ఆర్చరీలో రెండో స్వర్ణ పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైనల్ ఈవెంట్‌లో భారత బృందం గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. భారత మిక్స్‌డ్ జట్టులో చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ ఉన్నారు. ఫైనల్ గేమ్‌లో కొరియన్ జంటపై స్వల్ప ఆధిక్యంలో భారత్ కొనసాగింది. తొలుత కొరియన్ జంట పది పాయింట్లు సాధించి భారత్‌పై వత్తిడి పెంచింది. అయితే చికితా, సాహిల్ 10 పాయింట్స్ కొట్టి.. ఒక్క పాయింట్ లీడ్‌లో కొనసాగారు. దీంతో మరోసారి కొరియన్లపై వత్తిడి పెరిగింది. ఆ తర్వాత కొరియా క్రీడాకారిణి పార్క్ 10, చోయి 10 పాయింట్లు సాధించారు. దీంతో గోల్డ్ మెడల్‌ను డిఫెండ్ చేసుకునేందుకు...