రామాయణంతో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం..
దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రామాయణం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ఓ భారీ యానిమేటెడ్ చిత్రం రూపొందనుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కథకు అనుగుణంగా భారీ స్థాయిలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. అలాంటి దర్శకుడు రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాన్ని యానిమేటెడ్ రూపంలో ఎలా ఆవిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ప్రచారంలో...