నటుడు మధునందన్ పుట్టినరోజు.. ‘జంగా’ చిత్రం నుంచి పవర్‌ఫుల్ ఫ‌స్ట్ లుక్ విడుదల!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జంగా’ చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. నటుడు మధునందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయనకు సంబంధించిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మధునందన్ చాలా సీరియస్‌గా, ఏదో ఒక లోతైన అంశాన్ని తదేకంగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తున్న తీరు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఆయన పాత్ర ఈ కథలో చాలా కీలకంగా ఉండబోతుందని ఈ ఫస్ట్‌లుక్ స్పష్టం చేస్తోంది.శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ...