ఆరోగ్య పద్ధతులను ఫాలో అవుతున్నారా..
ప్రస్తుతం చాలామంది ఫైబర్ మ్యాక్సింగ్ పేరుతో ఒకేసారి అధిక మొత్తంలో ఫైబర్ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. సైలియం, ఇన్యులిన్, చియా గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను ఒకే స్మూతీలో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే ఒక్కసారిగా అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గట్ మైక్రోబయోమ్ కొత్త ఆహార మార్పులకు అలవాటు పడేందుకు సమయం అవసరం. అందుకే ఫైబర్ మోతాదును క్రమంగా పెంచుకోవడం మంచిది. పచ్చి పాలు వద్దు.. మరోవైపు ప్రతి వంటకాన్ని బీఫ్ టాలోలో వండే అలవాటు కూడా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఇందులో సంతృప్త కొవ్వులు...