పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తిరుమల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. ప్రతి ఏటా జూన్ మాసంలో పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు తన తల్లి పేరిట తిరుమలలో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలు కూడా తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలన్నారు.తిరుమలలో కమాండ్...