మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”!

కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కచ్చితత్వంతో తొలిదశ మానవ పిండాల డీఎన్‌ఏను విజయవంతంగా ఎడిట్‌ చేశారు. ఈ మైలురాయి భవిష్యత్తులో వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులు తదితర వ్యాధులను నివారించడానికి సహాయపడవచ్చు. కానీ ఇది తమకు నచ్చిన లక్షణాలతో కూడిన పిల్లలను సృష్టించే అవకాశం గురించిన ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. ఈ పరిశోధనకు జన్యు శాస్త్రవేత్త డైటర్‌ ఎగ్లీ నాయకత్వం వహించారు. మానవ పిండాల డీఎన్‌ఏను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ప్రజల్లో చర్చను ఈ ఫలితాలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. “మేము శాస్త్రీయ డాటాను అందించగలం, కానీ ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించాలో సమాజమే నిర్ణయించాలి” అని...