తెలుగులో దూసుకెళ్తున్న ‘పెద్ది’.. హిందీలో మాత్రం నెమ్మదించిన పరుగు, కారణాలివే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయాలు ‘చాలా బాగుంది’ నుంచి ‘యావరేజ్’ వరకు భిన్నంగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ స్టార్‌డమ్‌తో పాటు పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపు ప్రభావం కొంత మేర కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు రూ.400 దాటడంతో అభిమానుల్లో కొందరు సినిమాలు చూసేందుకు...