వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్..
రాజన్న సిరిసిల్ల జిల్లా::// ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ఆదివారం అదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవోలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్లు ఎమ్మెల్యేకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి...