బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

హైదరాబాద్, జూన్07: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని.. అప్పులు పాలు చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునని ఆయన విమర్శించారు. పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. ఆదివారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి ఆర్థిక పరిస్థితి.. మీరు గద్దె దిగిపోయే నాటికి ఉన్న పరిస్థితిపై విదేశాల్లో ప్రసంగించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు...